వివరాలు తెలుపుతున్న ఎస్పీ ప్రేమ వివాహానికి ఒప్పుకోవడం లేదని ఏకంగా తల్లిదండ్రులను హత్య చేసిన వ్యక్తిని అతనికి సహకరించిన మరో వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. డీ.హీరేహాళ్ మండల కేంద్రంలో గత ఏడాది నవంబర్ 28న బసవరాజు, అతని భార్య లక్ష్మిదేవీలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో వారి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేనమామే ఆస్తి కోసం హత్యలు చేసినట్లు పోలీసులకు అశోక్ తెలిపాడు. అతని మాటలకు వాస్తవాలను సంబంధం లేకపోవటంతో అశోక్‌పై అనుమానం వచ్చి విచారించగా.. అసలు విషయం బయటపడింది.
పెళ్లి కాదేమోనని...
ప్రైవేటు ఫ్యాక్టరీలో పని చేసే అశోక్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమకు అశోక్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇదే విషయంపై వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ పరిస్థితులతో విసిగిపోయిన అశోక్ తన తల్లిదండ్రులు బతికున్నంత వరకు పెళ్లి కాదని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు జమ్మన్నతో కలసి తల్లిదండ్రులను రాడ్‌తో కొట్టి హత్యలు చేశాడు. అనంతరం డాగ్ స్క్వాడ్‌కు అనుమానం రాకుండా కారంపొడి చల్లాడు. పథకం ప్రకారం ఈ హత్య కేసును మేనమామ పైకి నెట్టాడు. కాని చివరకు పోలీసు విచారణలో అసలు విషయాలు వెలుగులోకి రావటంతో కటకటాలపాలయ్యాడు.
ఇదీ చూడండి
ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకులు... 25లక్షలు స్వాహా