ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు - ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు
ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చాడు కుమారుడు. 48 గంటల్లోనే ఈ కేసు పోలీసులు ఛేదించి నిందుతులను అరెస్టు చేశారు. అప్పులు తీర్చాలని ఈ దురాఘాతానికి పాల్పడినట్టు నిందితుడు తెలిపారు.
ఆస్తి ముందు అనుబంధం చిన్నబోయింది.తండ్రి పంచిన మమకారాన్ని మరచిపోయి మాట నేర్పిన గొంతునే కోసేశాడో కుమారుడు.ఆత్మీయత కంటే ఆస్తి గొప్పదని భ్రమించ...కన్నతండ్రిని చంపి కటకటాలపాలయ్యాడు.అనంతపురంజిల్లా తాడిపత్రిలో హత్యకు గురైన విశ్రాంత అగ్నిమాపక హెడ్ కానిస్టేబుల్ హత్య కేసును పోలీసులు48గంటల్లో ఛేదించారు.అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాల్సి వస్తుందనే నెపంతో నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.