అనంతపురం జిల్లా తనకల్లు మండలం సీఆర్పల్లి సమీపంలోని చెరువులో గల్లంతైన ఇంటర్ విద్యార్థి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. బట్టలు ఉతికేందుకు వెళుతున్న తల్లికి తోడుగా వెళ్లిన హరీష్ చెరువులోని నీటి లోతును అంచనా వేయలేక...చెరువులో దిగి గల్లంతయ్యాడు. గ్రామస్తులు, పోలీసులు విద్యార్థి కోసం శనివారం గాలించారు. చీకటి పడటం వల్ల సాధ్యం కాలేదు. ఆదివారం ఉదయం మరోసారి విద్యార్థి కోసం చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది.
తల్లికి తోడుగా వెళ్లి తనువు చాలించాడు.. - son fell in pond in ananthapur district
తన తల్లికి తోడుగా చెరువు వద్దకు వెళ్లిన తనయుడు... తనువు చాలించాడు. చెరువు లోతును అంచనా వేయలేక, అందులో దిగి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం విద్యార్థి మృతదేహం లభ్యమైంది.
![తల్లికి తోడుగా వెళ్లి తనువు చాలించాడు.. son fell in pond and died in ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6586684-1108-6586684-1585494906165.jpg)
చెరువులో పడి ఇంటర్ విద్యార్థి మృతి