కన్నవారిని కాల్చేశాడు - kanekal
ఆస్తి పంపకాల్లో చెలరేగిన వివాదంతో కుమారుడే... తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. తీవ్రగాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు
అనంతపురం జిల్లా కణేకల్‌లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాలు తీవ్ర నిర్ణయాలకు దారితీశాయి. ప్రాణాలు బలిగొనే స్థాయికి చేరాయి. తనకు నచ్చినట్టుగా వినలేదన్నఆగ్రహంతో కన్నవారినే కడతేర్చాలనుకున్నాడు కొడుకు మధుసూదన్ రెడ్డి. వారిపై పెట్రోల్ పోసి నిప్పంచించాడు. తీవ్రగాయాలపాలైన నారాయణరెడ్డి, నర్సమ్మను బళ్లారి విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వృద్ధ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.