ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం.. కన్నతండ్రిపై తనయుడు వేట కొడవలితో దాడి - ఈరోజు కన్న తండ్రిపై కొడుకు దాడి వార్తలు

జన్మనిచ్చి.. విద్యాబుద్దులు నేర్పించి.. తనకో జీవితాన్ని ఇచ్చిన తండ్రినే కడతేర్చాలనుకున్నాడో కొడుకు. మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో అనే అనుమానం రేకెత్తించే ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణం దాసరి వీధిలో జరిగింది.

son attack on his father
కన్న తండ్రిపై తనయుడు దాడి

By

Published : Apr 21, 2021, 6:08 PM IST


అనంతపురం జిల్లా గుత్తి పట్టణం దాసరి వీధి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రిపై వేట కొడవలితో కుమారుడు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి రామచంద్ర పైన.. తనయుడు అశోక్ అతి దారుణంగా వేటకొడవళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details