ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపిన కుమారుడు - Son attack on father beaten him to death.

పింఛను, ఆస్తి విషయంలో తండ్రితో జరిగిన వివాదంలో.. మద్యం మత్తులో ఉన్న కుమారుడు అతడిని కొట్టి చంపాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. నిందితుడిని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.

son beaten father to death at Anantapur district
మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపిన కుమారుడు

By

Published : Apr 5, 2021, 10:15 AM IST

అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగళ్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్న తండ్రిని కొట్టి చంపాడు. అర్ధరాత్రి సమయంలో పింఛన్ డబ్బుల విషయంలో తండ్రి ఒబన్న(70), కుమారుడు జయకృష్ణకు మధ్య వివాదం చెలరేగి గొడవ జరిగింది. ఈ క్రమంలో తండ్రిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఒబన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

తండ్రిపై దాడి చేసిన నిందితుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్తి విషయంలో వివాదం పెద్దదై నియంత్రణ కోల్పోయిన కుమారుడు.. ఒబన్నపై దాడి చేశాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:రాయలసీమ-కోస్తా మధ్య కొత్త విద్యుత్తు లైను

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details