ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పోలవరానికి కేంద్రం బాకీ లేదు.. పనులు పూర్తయ్యాకే నిధులు": సోము వీర్రాజు - సోము వీర్రాజు తాజా వార్తలు

SOMU VEERRAJU: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మించలేక చేతులెత్తేస్తే.. తాము పూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం కోరిన ఆరు వేల కోట్ల రూపాయల అడ్వాన్స్ కేంద్రం ఇవ్వదని.. చేసిన పనులను పరిశీలించాకే నిధులిస్తారని స్పష్టం చేశారు.

SOMU VEERRAJU
SOMU VEERRAJU

By

Published : Jul 15, 2022, 12:45 PM IST

SOMU VEERRAJU: పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ బాకీలేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అనంతపురంలో భాజపా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మించలేక చేతులెత్తేస్తే.. తాము పూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వాలు కమిషన్ల కోసం ప్రాజక్టును నిర్మిస్తామని చెప్పటం వల్లనే.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని వెల్లడించారు. గతంలో సీఎం చంద్రబాబు శక్తిసామర్థ్యాలు చూసి ప్రాజక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించామన్నారు. ప్రభుత్వం కోరిన ఆరు వేల కోట్ల రూపాయల అడ్వాన్స్ కేంద్రం ఇవ్వదని.. చేసిన పనులను పరిశీలించాకే నిధులిస్తారు తప్ప, ముందుగా చెల్లింపులు ఎవరూ చేయరని ఆయన చెప్పుకొచ్చారు.

అమలాపురంలో పంట సెలవు ప్రకటించటానికి కారణం.. రైతులకు మద్దతు ధర, పంట నష్టపరిహారం ఇవ్వకపోవడమేనని విమర్శించారు. సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై 'జన జాగృతి' యాత్రలు నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details