ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్ రిజర్వు స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు..! - Dharmavaram latest news

మున్సిపల్ రిజర్వు స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి ఏకంగా ఆ స్థలంపై రూ.రెండు కోట్లు ఎస్​ఎఫ్​సీ ద్వారా రుణం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మున్సిపల్ అధికారులకు విషయం తెలియడంతో అక్రమ రిజిస్ట్రేషన్ గుట్టు బయటపడింది. స్థలాన్ని అమ్మినవారిపై, కొన్న వ్యక్తిపైనా మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

Someone trying bank loan on Municipal Reserve Land
మున్సిపల్ రిజర్వు స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు..!

By

Published : Oct 10, 2020, 6:01 PM IST

ధర్మవరం పట్టణం నడిబొడ్డున ఉన్న స్టేట్ బ్యాంక్ కాలనీలో రాఘవేంద్ర స్వామి ఆలయం పక్కన మున్సిపాలిటీకి చెందిన 7.8 సెంట్ల రిజర్వ్ స్థలం ఉంది. 483/1లో ఉన్న స్థలం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుంది. 2004లో రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన బడముద్దల రంగయ్య అనే వ్యక్తి దీన్ని కొనుగోలు చేశాడు. మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన.. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్​లో రూ.2 కోట్ల రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేశాడు. విషయం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు తెలిసింది. స్థలం విక్రయించిన రామలక్ష్మి, కొనుగోలు చేసిన రంగయ్యపై ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 2004లో ధర్మవరం సబ్ రిజిస్ట్రార్​గా పనిచేసిన అధికారిపైనా ఫిర్యాదు చేశారు. ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details