జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే కొన్నిసెక్షన్లను చేర్చారని జేసీ తరఫు న్యాయవాది రవికుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులతో ప్రభాకర్ రెడ్డికి, అస్మిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారిద్దరికీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం... న్యాయవాది రవికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
'రాజకీయ కక్షతోనే జేసీ ప్రభాకర్‌పై అదనపు సెక్షన్లు' - జేసీ ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డి వార్తలు
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిపై రాజకీయ కక్షతోనే కొన్ని సెక్షన్లను చేర్చారని వారి తరఫు న్యాయవాది రవి కుమార్ వెల్లడించారు. ఈ కేసులతో వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
jc prabhakar
తాడిపత్రిలోని 17 కేసులకు, అనంతపురంలోని 5 కేసులకు ముందస్తు బెయిల్ వచ్చిందని వెల్లడించారు. కానీ రెండు కేసులు మాత్రం రాజకీయ కక్షతోనే పెట్టారని అన్నారు. తమకు కోర్టులోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.