అనంతపురం జిల్లాలోని రాయల్ భవానీ తన మిత్ర బృందంతో కలిసి వారం రోజులుగా కూరగాయలు, పండ్లు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి మురికివాడలు, నగర శివారులోని గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. కర్బూజా, కళింగర పండ్లతో పాటు 6 రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్లో బయటకు రాలేని రాలేని వారితోపాటు, పేద ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఇస్తున్నామని రాయల్ భవానీ మిత్రబృందం నిర్వాహకులు చెప్పారు. రైతుల నుంచి నేరుగా కొనటానికి తమ మిత్ర బృందం పది రోజులుగా గ్రామాల నుంచి ఉద్యాన ఉత్పత్తులను సేకరిస్తోందన్నారు.
రైతుల కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజల కడపు నింపుతూ..
లాక్ డౌన్ కారణంగా... తోటల్లోని కూరగాయలు, పండ్లను కొనుగోలు చేసి నిరుపేదలకు పంపిణీ చేయటానికి రాయల్ భవానీ మిత్ర బృందం ముందుకొచ్చింది. ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోలేక కంటతడి పెడుతున్న రైతులను ఆదుకొంటూ, నిరుపేదల రోజువారీ అవసరాలు తీరుస్తోంది.
రైతుల కన్నీళ్లు తుడుస్తూ..ప్రజల కడపు నింపుతూ...
TAGGED:
latest news of anantapur dst