అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవతో ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామం నీటి సమస్య పరిష్కారమైంది. పీఏబీఆర్ డ్యాం నుంచి ఉరవకొండకు వచ్చే 400 డయామీటర్ సామర్థ్యంతో ఉన్న హెచ్డీపీఈ వాటర్ పైప్‌లైన్ మోపిడి గ్రామం వద్ద కొద్దిరోజుల కిందట పగిలిపోయింది. పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోవటంతో పలు గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దీని ప్రభావం ఆమిద్యాల గ్రామంపై పడటంతో... నీటి సమస్య తీవ్రమైంది.
నీటి సమస్యపై ఆమిద్యాల గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే పైప్‌లైన్ బాగు చేయాలని ఆర్డబ్ల్యూ ఎస్ఈ హరేరామ్ నాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు పైప్‌లైన్‌కు మరమ్మతు చేశారు. ఈ క్రమంలో ఆమిద్యాల గ్రామం నీటి సమస్య పరిష్కారమైంది.