అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. గుంటూరులో రాజకీయ ఐకాస చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చిన ఐకాస సభ్యులు దీక్షా చేస్తున్నవారికి మద్దతు ప్రకటించారు. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అమరావతి దీక్షలకు అనంతపురం వాసుల సంఘీభావం - అమరావతి రైతుల దీక్ష
గుంటూరులో అమరావతికి మద్దతుగా రాజకీయ ఐకాస చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చిన ఐకాస నేతలు సంఘీభావం ప్రకటించారు.
![అమరావతి దీక్షలకు అనంతపురం వాసుల సంఘీభావం అమరావతి రైతులకు అనంతపురం జిల్లా వాసుల సంఘీభావం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6103548-17-6103548-1581947279320.jpg)
అమరావతి రైతులకు అనంతపురం జిల్లా వాసుల సంఘీభావం
అమరావతి రైతులకు అనంతపురం జిల్లా వాసుల సంఘీభావం