ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి కరోనా లక్షణాలు..! - ananthapur district latest updates

హైదరాబాద్​లో పనిచేస్తున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి కరోనా లక్షణాలను గుర్తించారు రాయదుర్గం ప్రభుత్వ వైద్యాధికారి. ఈ ఉద్యోగి 15 రోజుల క్రితం రాయదుర్గం వచ్చారు. మూడు రోజుల నుంచి జలుబు, దగ్గు , ఛాతి సంబంధమైన సమస్యలు రావడం వల్ల స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.

software employee having corona
సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి కరోనా లక్షణాలు..!

By

Published : Mar 29, 2020, 10:27 PM IST

సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి కరోనా లక్షణాలు..!

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ యువకునికి కరోనా లక్షణాలు ఉన్నట్లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఆ యువకుడు హైదరాబాద్​లోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు.15 రోజుల క్రితం మరొక వ్యక్తితో కలిసి రాయదుర్గం వచ్చాడు. మూడు రోజుల నుంచి జలుబు, దగ్గు, ఛాతి సంబంధమైన నొప్పులు రావడం వల్ల ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. ప్రభుత్వ వైద్యాధికారి మహేష్ అతనికి వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబంలోని నలుగురికి పరీక్షలు చేశారు. వారందరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి... కరోనా లక్షణాలు గురించి వైద్యాధికారి మహేష్​ని అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details