అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు వచ్చే వారిపై.. సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. కరోనా వైరస్ దరిచేరకుండా తమిళనాడులో ఒక మార్కెట్ వద్ద ఈ విధానం అమలు చేస్తుండటాన్ని అధ్యయనం చేశామని.. ధర్మవరం పురపాలక కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయలు మార్కెట్‌కు వెళ్లేవారిపై.. ఈ యంత్రాల ద్వారా వైరస్ నాశక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ద్రావణం వల్ల వైరస్ దరిచేరదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మార్కెట్‌కు వెళ్లేవారు ద్రావణాన్ని పిచికారీ చేయించుకొని.. కొత్త అనుభూతితో వెళ్తున్నామన్నారు.
కూరగాయల మార్కెట్‌కి వెళ్లేవారిపై ద్రావణం పిచికారీ
కరోనా నివారణ చర్యల్లో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని కూరగాయల మార్కెట్ కు వెళ్తున్న వారిపై.. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.
Sodium hypochloride solution is poured on purchasers at dharmavaram market in ananthapuram