అనంతపురం జిల్లాలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమాజంలో మార్పులు తేవాలనే అంశాలపై అంబేద్కర్ జీవిత చరిత్ర, జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర, వేమన జీవిత చరిత్ర అంశాలతో మూడు రోజుల పాటు ఈ చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు అంబేద్కర్ జీవిత చరిత్రపై చేసిన చైతన్య కార్యక్రమంలో... కళాకారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.
అనంతపురంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు - Socio Cultural Activities held at Anantapur in association with sfi
అనంతపురంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని లలిత కళా పరిషత్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతపురంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు