అనంతపురం జిల్లా కదిరిలో జాతీయ రహదారిపై ఉన్న ఒక మద్యం దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు బారులు తీరారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు సైతం ధరించకుండా వరసలో నిలుచున్నారు. ఒకరిమీద ఒకరు పోటీపడుతూ మద్యం కోసం ఎగబడుతున్నారు. మద్యం దుకాణాదారులు కానీ, అధికారులు గానీ కనీస జాగ్రత్తలు తీసుకునేలా వారిని హెచ్చరించకపోవడం గమనార్హం.
మద్యం షాపుల ముందు కనుమరుగువుతున్న భౌతికదూరం - అనంతపురం జిల్లా, కదిరి
మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం మరిచిపోతున్నారు. మద్యం మీద ఉండే ఆశ.. కరోనాతో వచ్చే ముప్పుపై ధ్యాస లేకుండా చేస్తోంది. కదిరిలోని ఒక మద్యం షాపు ముందు మందుబాబులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

మద్యం షాపుల ముందు కనుమరుగువుతున్న భౌతిక దూరం