ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురుస్తున్న మంచు.. వణుకుతున్న ప్రజలు - Anantapur District Temperatures

ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి ప్రభావం పెరుగుతోంది. తుపాను ప్రభావంతో ముందుగానే చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. మంచు ప్రభావంతో... రహదారులపై జనసంచారం తగ్గిపోయింది.

Snow falling at anantapur district
చలి పులి

By

Published : Dec 2, 2020, 10:31 AM IST

చలి పులి పంజా విసిరింది. నివర్‌ తుపాను తర్వాత జిల్లాలో మరింత తీవ్రమైంది. రాత్రే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం కాగానే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలైనా వణుకు తగ్గడం లేదు. సహజంగా డిసెంబరు మొదటి వారంలో చలి ప్రభావం కనిపిస్తుంది. ఈసారి నివర్‌ తుపాను మూలంగా పది రోజులు ముందుగానే చలి గాలులు మొదలయ్యాయి. ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. సంక్రాంతి వరకూ ఈ ప్రభావం ఉంటుందని రేకులకుంట వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సీజన్‌లో అతి తక్కువగా మంగళవారం కనిష్ఠంగా 19.1, గరిష్ఠంగా 30.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

మంచు కురుస్తోంది

అనంతపురం జిల్లాలో రాత్రి కంటే పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఉదయం 9 గంటలైనా వణుకు తగ్గడం లేదు. ఇక సాయంత్రం 5 గంటలకే ప్రభావం మొదలవుతోంది. కిటికీలు, తలుపులు మూసుకున్నా ఇళ్లల్లోకి చలిగాలులు చొరబడుతున్నాయి. బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. రాత్రి 8 గంటలు కాగానే ప్రధాన పట్టణాల్లో జన సంచారం ఏమాత్రం కనిపించడం లేదు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 దాకా మంచు కురుస్తోంది. రహదారులు కనిపించడం లేదు.

నడకకు ఆటంకం

పల్లెల్లో పొలాల వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు. తెలవారుజామున చలి మంటలు వేసుకుని సేద తీరుతున్నారు. ఇక పట్టణాల్లో సూరీడు బయటకు వచ్చేదాకా తలుపులు తెరుచుకోవడం లేదు. ఉదయం నడక, జాగింగ్‌ వెళ్లడానికి భయపడుతున్నారు. మైదానాల్లో ఉదయం 7 గంటల దాకా ఎవరూ కనిపించడం లేదు. చర్మ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఉదయం నడక మానేసి ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

ఇదీ చూడండి:

2019 ఖరీఫ్‌ పంటల బీమా ప్రీమియం రూ.590 కోట్లు

ABOUT THE AUTHOR

...view details