అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం తండాలో విషాదం నెలకొంది. గాలివానకు గ్రామంలో ఉండే సర్వీస్ వైర్ తెగిపడింది. రోడ్డుపై పడిపోయిన వైర్‌ను స్థానికులు స్తంబానికి చుట్టిపెట్టారు. ఉదయం చరణ్ అనే (9) బాలుడు ఆడుకుంటూ విద్యుత్ వైర్‌ను తాకాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని తల్లిందండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి - current shock news in anantapur dst
విద్యుత్ తీగ తగిలి 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలంలో జరిగింది.
small boy died in anantapur dst due to current shock