గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం, మౌళిక వసతులు కల్పించడం లేదంటూ శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాచేశారు.వసతి గృహాల్లో సౌకర్యాలపై వార్డెన్లకు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. తాము ఎన్ని రోజులు ఇలా అసౌకర్యాల మధ్య ఉండాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వర్శిటీకి చేరుకుని ఆందోళన విరమించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
రోడ్డెక్కిన కృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులు - శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వసతి గృహంలో సౌకర్యాల లేమిపై విద్యార్థులు రోడ్డెక్కారు.వర్శీటి మెయిన్ గేట్ వద్ద వర్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధర్నా చేస్తున్న విద్యార్థులు