ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి మండలంలోనూ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు' - skill development centres

ప్రతి మండలంలోనూ స్కిల్​డెవలప్​మెంట్ సెంటర్లు(నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు)ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. గుంతకల్లులోని ఓ శిక్షణా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ ను పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి

By

Published : Jun 25, 2019, 6:51 AM IST

గుంతకల్లులో కార్మికశాఖ మంత్రి పర్యటన

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే పాఠశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, రైల్వే డీఆర్ఎంతో కలసి సెంటర్​ను తనిఖీ చేశారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తర్ఫీదు పొందిన ప్రతి మహిళకూ ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం రైల్వే డీఆర్ఎం విజయప్రతాప్ సింగ్​తో ప్రత్యేకంగా సమావేశమై... గుంతకల్లు డివిజన్​ అభివృద్ధిపై చర్చించారు. రైల్వే కార్యక్రమాలపై , ప్రయాణికుల భద్రతపై మంత్రి ఆరా తీశారు

ABOUT THE AUTHOR

...view details