అనంతపురం జిల్లా గుంతకల్లు మొమినాబాద్లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. కాలనీలోని 16 మందిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే... ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నామని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గుంతకల్లులో పిచ్చికుక్క దాడి... 16మందికి గాయాలు - ananthapuram district crime
అనంతపురం జిల్లా గుంతకల్లులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కాలనీలోని 16మందిని గాయపరిచింది. చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రులకు తరలించారు.
గుంతకల్లులో పిచ్చికుక్క దాడి... 16మందికి గాయాలు