నరసాపురంలో బోల్తాపడిన బొలెరో వాహనం..ఆరుగురికి తీవ్రగాయాలు - నరసాపురంలో రోడ్డు ప్రమాదం వార్తలు
అనంతపురం జిల్లా నరసాపురం సమీపంలో జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా..ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నరసాపురం సమీపంలో జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్నవారిపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పడడంతో.. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషమంగా ఉన్న ఇద్దరిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన వారు కాగా.. వారందరూ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి.కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..12కు చేరిన మృతుల సంఖ్య