Six people died into pond: తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను టూర్‌లాగా ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు. ఈత కొట్టడానికి ఎర్రగుంట చెరువులోకి విద్యార్థులు దిగారు.
చెరువు లోతుగా ఉండడంతో మునిగిపోతున్న విద్యార్థులను కాపాడడానికి ఉపాధ్యాయుడు కూడా చెరువులోకి దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటకిరాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు గల వారని తెలుస్తోంది.