ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలు..! - Six nominations filed on the first day of Kadari

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 61 ఎంపీటీసీ స్థానాలకు గాను...తొలి రోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి.

Six nominations filed on the first day of Kadari
కదిరిలో తొలిరోజు ఆరు నామినేషన్ల దాఖలు

By

Published : Mar 10, 2020, 10:21 AM IST

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాల కోసం మొదటిరోజు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. కదిరి నియోజకవర్గంలో 61 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలిరోజు తనకల్లు మండలంలోని మలిరెడ్డి పల్లి స్థానానికి తెదేపా అభ్యర్థిగా వెంకటరమణ, వైకాపా అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన్లు వేయగా...బాలసముద్రం స్థానానికి తెదేపా నుంచి గోపీనాథ్ నామినేషన్ వేశారు. నల్లచెరువు మండలం ఓరువాయి నుంచి భాజపా అభ్యర్థిగా గంగాదేవి నామినేషన్ దాఖలు చేశారు. కదిరి మండలం ఎర్రదొడ్డి స్థానానికి వైకాపా అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి , ఎగువపల్లి స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి సుధాకర్ నాయుడు నామినేషన్లు వేశారు. తలుపుల, గాండ్లపెంట, నంబులపూలకుంట మండలాలలో మొదటిరోజు నామినేషన్లు​ దాఖలు కాలేదు.

కదిరిలో తొలిరోజు ఆరు నామినేషన్ల దాఖలు

ABOUT THE AUTHOR

...view details