ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పామిడిలో ఐపీఎల్ బెట్టింగ్... ఆరుగురి అరెస్టు

By

Published : Oct 16, 2020, 5:24 PM IST

పామిడి పట్టణ కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. రూ.4900, నగదుతో పాటు 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Six Members arrest in Pamidi over IPL Betting
పామిడిలో ఐపీఎల్ బెట్టింగ్... ఆరుగురు అరెస్టు

అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. పామిడి పట్టణ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ... పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. క్రికెట్ బెట్టింగ్ కు పాలుపడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.4900, నగదుతో పాటు 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచి రిమాండ్​కు తరలిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details