'గుత్తికోటలో మన్రో 192వ వర్థంతి కార్యక్రమం' - anathapuram
శ్రీ కృష్ణ దేవరాయలు తర్వాత రాయలసీమ అభివృద్ధికి విశేష కృషి చేసిన అనంతపురం జిల్లా తొలి ప్రిన్సిపల్ కలెక్టర్ సర్ థామస్ 192వ వర్ధంతిని గుత్తి కోటలో నిర్వహించారు.
అనంతపురం జిల్లా తొలి ప్రిన్సిపల్ కలెక్టర్ సర్ థామస్ మన్రో 192వ వర్ధంతి సందర్భంగా గుత్తి కోటలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పించారు. మన్రో మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కృష్ణ దేవరాయలు తర్వాత రాయలసీమ అభివృద్ధికి మన్రో విశేష కృషి చేశారని ట్రస్ట్ ఛైర్మన్ తోట నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంగా తొలి ప్రిన్సిపల్ కలెక్టర్ గా నియమితులైన మన్రో ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ముఖ్యంగా అప్పటివరకు ఉన్న శాశ్వత శిస్తు విధానం స్థానంలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ప్రాంత వ్యవసాయాభివృద్ధికి ఆద్యుడిగా నిలిచిపోయారని . ఆనాడు ప్రజలను పట్టి పీడించిన పాలెగాళ్లను ఉక్కుపాదంతో అణచివేసి శాంతిభద్రతలను పరిరక్షించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.