సింగనమల తెదేపా గ్రామకమిటీ ఎన్నికల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ... కొంతమంది నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఒక వర్గానికి ఇంఛార్జ్ పదవి ఇచ్చారని... గ్రామ కమిటీల్లోనూ ఒక వర్గానికే న్యాయం చేశారని మరొకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వారందరికి న్యాయం జరగాలి కానీ ఒకరికే పదవులు ఇవ్వడం సరైనదికాదని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీకి గెలుస్తుందని లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు తెలిపారు. పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
'ఇరు వర్గాలకు న్యాయం చెయ్యండి' - singanamala tdp leaders meeting news in telugu
తెదేపా గ్రామకమిటీ ఎన్నికల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ... కొంతమంది నాయకులు సింగనమలలో సమావేశం నిర్వహించారు. ఒక వర్గంలోని వారికే పదవులు ఇవ్వడం సరైనదికాదని... పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

singanamala tdp leaders meeting
'ఇరు వర్గాలకు న్యాయం చెయ్యండి'