అభ్యుదయ సాహితీవేత్త సింగమనేని నారాయణ అంత్యక్రియలు అనంతపురం జిల్లా కనగానపల్లెలో పూర్తయ్యాయి. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఈనెల 15న అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన భౌతికకాయంతో అనేకమంది ప్రముఖులు, సాహితీవేత్తలు, కవులు వెంట ఉండి ప్రత్యేక వాహనంలో కనగానపల్లె వరకు అంతిమయాత్ర నిర్వహించారు.
కనగానపల్లె వ్యవసాయ క్షేత్రంలో సింగమనేని అంత్యక్రియలు పూర్తి - kanaganapalle latest news
ప్రముఖ సాహితీవేత్త సింగమనేని నారాయణ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలో నిర్వహించారు. సింగమనేని మృతి పట్ల ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషా పండితులు విచారం వ్యక్తం చేశారు. సమాజంలోని రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప సాహితీవేత్తగా ఆయనను కొనియాడారు.
కనగానపల్లే వ్యవసాయ క్షేత్రంలో సింగమనేని అంత్యక్రియలు పూర్తి
కనగానపల్లెలో సింగమనేని కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. సింగమనేని నారాయణ మృతి పట్ల ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషా పండితులు నివాళులర్పించారు. సమాజంలోని రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప సాహితీవేత్తగా సింగమనేనిని ప్రముఖులు కొనియాడారు.
ఇదీ చదవండి