అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బయన్న స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలో ఎవరూ లేని సమయంలో దొంగలు లోపలికి చొరబడి 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని.. ఆలయాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
బయన్నస్వామి దేవాలయంలో వెండి ఆభరణాలు చోరీ - బయన్నస్వామి ఆలయంలో చోరీ వార్తలు
అనంతపురం జిల్లా మడుగుపల్లి బయన్నస్వామి దేవాలయంలో దొంగలు పడి.. 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బయన్నస్వామి దేవాలయంలో వెండి ఆభరణాలు చోరీ