అనంతపురం జిల్లా రొద్దం మండలం బీదానపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన ఆముదం పంటకు మందు చల్లించాడు. గాలికి ఆ మందు పక్కనే ఉన్న మల్బరీ తోటపై పడింది. ఈ విషయాన్ని గమనించని రైతులు గురువారం రాత్రి మందు పడిన మల్బరీ ఆకులు పట్టుపురుగులకు మేతగా వేశారు. వాటిని తిన్న పట్టుపురుగులు మొత్తం శుక్రవారం ఉదయానికి మృత్యువాత పడ్డాయి.
మందు పడిన మల్బరీ ఆకులు తిని పట్టుపురుగులు మృతి - silkworms died by ate drugged mulberry leaves
అనంతపురం జిల్లా రొద్దం మండలం బీదానపల్లి గ్రామంలో మందు పడిన మల్బరీ ఆకులు తిని పట్టుపురుగులు చనిపోయాయి.
మందు పడిన మల్బరీ ఆకులు తిని... పట్టుపురుగులు మృతి
ఈ ఘటనలో గ్రామానికి చెందిన తిమ్మయ్య, గోపాల్, వెంకటేష్ అనే రైతుల పట్టుపురుగులు చనిపోయాయి. సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఆముదం పంటకు మందు చల్లిన రైతుపై పోలీసులకు వారు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: కదిరి: ఇరువర్గాల మధ్య భూవివాదం
Last Updated : Sep 25, 2020, 7:32 PM IST