ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో పట్టు రీలర్ల ర్యాలీ, మానవహారం - డిమాండ్ల సాధన కోసం హిందూపురంలో పట్టు రీలర్ల మానవహారం

అనంతపురం జిల్లా హిందూపురంలో పట్టు రీలర్ల అసోసియేషన్.. ర్యాలీ, మానవహారం నిర్వహించింది. చట్టసభల ప్రస్తుత సమావేశాల్లో వారి సమస్యలపై చర్చ జరిగే విధంగా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

silk reeles protest
పట్టు రీలర్ల ఆందోళనలు

By

Published : Dec 2, 2020, 4:02 PM IST

డిమాండ్ల సాధన కోసం అనంతపురం జిల్లా హిందూపురంలో.. పట్టు రీలర్ల అసోసియేషన్.. ర్యాలీ, మానవహారం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా పట్టణంలోని మార్కెట్ నుంచి గురునాథ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. సీపీఐ, సీపీఎం వారికి మద్ధతు తెలిపాయి.

ఏడు రోజులుగా పట్టు రీలర్లు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకుని.. న్యాయం జరిగేలా చూడాలని సీపీఐ నాయకులు కోరారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీలు స్పందించి.. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ వ్యవహారంపై చర్చ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details