పట్టు వ్యాపారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్సెంటివ్ బకాయిలు 8 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయని అనంతపురం జిల్లా వ్యాపారులు ఆందోళనకు దిగారు. హిందూపురంలో పట్టు వ్యాపారుల కోసం పట్టు పరిశ్రమ శాఖ కేటాయించిన 8 ఎకరాల 31 సెంట్ల స్థలాన్ని తక్షణమే పంపిణీ చేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. వ్యాపారులు పట్టు కొనుగోలు చేయకుండా ఆందోళన చేయడంతో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టు రీలర్ర్ల ఆందోళన విషయం తెలుసుకున్న పట్టు పరిశ్రమ శాఖ ఏడి నాగ రంగయ్య మార్కెట్కు వచ్చి పట్టు వ్యాపారులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇన్సెంటివ్తో పాటు పట్టు రీలర్లకు కేటాయించిన స్థలాన్ని అప్పగించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
హిందూపురంలో పట్టు వ్యాపారుల ఆందోళన - హిందూపురం
అనంతపురం జిల్లా హిందూపూరం పట్టుగూళ్ల మార్కెట్లో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన వ్యాపారులు.
హిందూపురంలో పట్టు వ్యాపారస్థుల ఆందోళన