ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదమని తెలిసినా... ప్రాణాలకు తెగించి మరీ..!

ప్రమాదంలో ఉన్న మహిళను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి మరీ ప్రయత్నించారు ఈ ఎస్సై. ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా నీటిలోకి దిగారు. ఆమెను గట్టుకు తీసుకురాలేకపోయినప్పటికీ ఆయన సాహసాన్ని అందరూ అభినందించారు.

SI attempt to save a woman in danger at rayadurgam
ప్రమాదమని తెలిసినా... ప్రాణాలకు తెగించి

By

Published : Jan 10, 2021, 10:39 AM IST

ప్రమాదమని తెలిసినా... ప్రాణాలకు తెగించి

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గ్రామదట్లకు చెందిన దుర్గమ్మ(55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నొప్పి తాళలేక జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం కణేకల్లు సమీపంలో చెరువులోకి హెచ్చెల్సీ ప్రవేశించే ప్రదేశంలో దూకింది. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకొన్న కణేకల్లు ఎస్సై సురేష్‌ వెంటనే అక్కడికి చేరుకొన్నారు. ఆ మహిళను కాపాడేందుకు సీఐఎస్‌ఎఫ్‌ విశ్రాంత జవాను ప్రహ్లాద, మరో స్థానిక యువకుడు అప్పటికే నీటిలో ఉండటం చూశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హెచ్చెల్సీలో ఈదుకొంటూ వెళ్లి చెరువులోకి ప్రవేశించారు.

ఒకచేత్తో చెట్టును, మరోచేత్తో మహిళను పట్టుకొని గట్టుకు తెచ్చే ప్రయత్నంలో చెట్టు వేర్లతోపాటు ఊడొచ్చింది. నిస్సహాయ స్థితిలో ఆమెను నీటిలో వదిలేసి గట్టుకు చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో మహిళను కాపాడే ప్రయత్నం చేసిన ఎస్సైను స్థానికులు ప్రశంసించారు. సమాచారం తెలుసుకొన్న ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు ఫోన్‌ చేసి.. ఆయనకు అభినందనలు తెలిపారు. కళ్యాణదుర్గం డీఎస్సీ రమ్య, సీఐ రాజా పోలీసుస్టేషన్‌కు చేరుకొని ఎస్సైను అభినందించారు. మహిళను కాపాడి ఉంటే బాగుండేదని ఎస్సై ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details