ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ రామ్​రెడ్డి తాగు నీటి పథకం కార్మికుల రిలే నిరాహార దీక్ష - ప్రజా సంఘాలు సంఘీభావం

అనంతపురంలో శ్రీ రామ్​రెడ్డి తాగు నీటి పథకం కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్ని సార్లు వినతిపత్రాల్ని అందించినా అధికారులు స్పందించకపోవడం వల్లే నిరసనకు దిగామని తెలిపారు.

నీటి పథకం కార్మికుల రిలే నిరాహార దీక్ష
నీటి పథకం కార్మికుల రిలే నిరాహార దీక్ష

By

Published : Nov 19, 2020, 7:49 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట శ్రీ రామ్​రెడ్డి తాగు నీటి పథకం కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రతతోపాటు, పింఛన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల వేతనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలియజేశాయి. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు వినతిపత్రాల్ని అందించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తగిన పరిష్కారం చూపలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details