ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపంతో మంటలు - short circuit at power sub station

సాంకేతిక కారణాలతో అనంతపురం జిల్లాలోని ఓ విద్యుత్ ఉప కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఉద్యోగుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

fire accident at power station
విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపంతో మంటలు

By

Published : Jun 9, 2021, 4:26 PM IST

అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపం వల్ల ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. తలుపుల కుమ్మరపేట వద్ద ఉన్న విద్యుత్ ఉప కేంద్రంలోని కెపాసిటర్ బ్యాంక్ సిలిండర్​లో సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తతో వెంటనే సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. ఫలితంగా మంటలను అదుపులోకి వచ్చాయి. అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదం జరిగేదని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారు. సిబ్బంది సకాలంలో స్పందించి మరమ్మతులు చేయడం వల్లే ప్రమాదం తప్పిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details