ప్రశాంతి నిలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకులు - పుట్టపర్తిలో మహాశివరాత్రి వేడుకలు
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా నాదస్వరం, పంచవాద్యం, సంగీత కచేరీ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రశాంతి నిలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకులు
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శివరాత్రి వేడుకల కోసం సాయికుల్వంత్ మందిరాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 8 గంటలకు వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వేళ నాదస్వరం, పంచవాయిద్య ఘోష నడుమ సాయి ఈశ్వర లింగాన్ని... భజన మందిరం నుంచి సాయికుల్వంత్ మందిరంలోకి వేదపండితులు తీసుకొచ్చారు. మహాసమాధి చెంత శివలింగాన్ని కొలువుదీర్చి సాయి అష్టోత్తరపూజ, పుణ్యనదీ జలాలతో మహారుద్రాభిషేకం నిర్వహించారు.