అనంతపురం జిల్లా గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన కలకలం రేపింది. వేల్ఫేర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సాయిరాంపై ఓ మహిళ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబుకు ఫిర్యాదు చేసింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడంలో వేల్ఫేర్ ఇన్స్పెక్టర్ పాత్ర కీలకం. పదవిని అడ్డుపెట్టుకుని ఇలాంటి పనులకు వచ్చే మహిళలను లోబరుచుకున్నారంటూ గత కొన్నేళ్లుగా సాయిరాంపై ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో రైల్వేలో పని చేసే ఓ ఉద్యోగి ఇన్ సర్వీస్‌లో మృతి చెందాడు. తన తండ్రి స్థానంలో ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. చివరికి లొంగదీసుకున్నాడు. ఆమెకు తెలియకుండా వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ చాలా కాలం కీచక పర్వాన్ని కొనసాగించాడు. గత సంవత్సరం వీరిద్దరి అభ్యంతరకర ఫోటో బయటకు రావడంతో ఉన్నతాధికారులు సాయిరాంను నాందేడ్‌కు బదిలీ చేశారు.