'తెదేపా హయాంలో.. అమరావతిలో అభివృద్ధి లేదు' - amaravathi
అమరావతి అభివృద్ధికి రుణం సాయం చేయమని ప్రపంచబ్యాంకు ప్రకటించటంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెదేపా వల్లే నిధులు వెనక్కు వెళ్లాయని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.
మంత్రి
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ ఆరోపించారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో మంత్రి పర్యటించారు. తెదేపా ఐదేళ్ల పాలనలో రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. రైతుల నుంచి భూములు తీసుకునే క్రమంలో జరిగిన ల్యాండ్ పూలింగ్ సక్రమంగా జరగలేదని అన్నారు.