ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా - ananthapur

ఓపెన్ స్కూల్స్​లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...అనంతపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

By

Published : Apr 30, 2019, 3:22 PM IST

కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

ఓపెన్ స్కూల్స్​లో జరుగుతున్న అక్రమాలపై విచారించి, చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పేరుతో కరవు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు లంచాలు తీసుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారని... దీనిపై కలెక్టర్ చొరవ తీసుకొని బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరీక్షా విధానాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details