కళాశాల సిబ్బందితో... ఎస్ఎఫ్ఐ నాయకుల వాగ్వాదం - sfi
అనంతపురం జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో వివాదం చోటు చేసుకుంది. విద్యార్థినిని ఫీజు కట్టలేదంటూ సిబ్బంది తరగతి గది బయట నిలబెట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాలకు చేరుకుని సిబ్బందితో వాగ్విదానికి దిగి... ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఫీజు చెల్లింపు విషయంలో సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పంగా మారింది. బస్టాండ్ సమీపంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఫీజు కట్టలేదంటూ సిబ్బంది... తరగతి గది బయట నిలబెట్టారు. విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలియజేసింది. ఇంతలో సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు... కళాశాలకు చేరుకుని సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థినిని ఎలా బయట నిలబెడతారని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నాయకులు కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రిన్సిపల్ మాత్రం తమ కళాశాలలో ఎలాంటి గొడవ జరగలేదని.. తాము ఎవరినీ ఫీజుల విషయంలో ఒత్తిడి చేయలేదని చెప్పారు.