అనంతపురం జిల్లా గుంతకల్లు మిల్లు కాలనీలోని ఐటీఐ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ ను విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కళాశాలకు సక్రమoగా రావాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడే.. విధులకు ఆలస్యంగా వచ్చి ...ముందే వెళ్తున్నారని ఆరోపించారు. కళాశాలలో కనీస మౌలిక వసతులూ కల్పించడం లేదంటూ.. విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు.
'ప్రిన్సిపల్ ను విధుల నుంచి తొలగించాలి' - SFI leaders protest infront of ITI College to remove the principal from duty being late for duty ... and going ahead.
ప్రధానోపాధ్యాయుడు కళాశాలకు ఆలస్యంగా వస్తున్నారని.. వెంటనే ఆయన్ను విధులనుంచి తొలగించాలని.. గుంతకల్లు ఐటీఐ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
!['ప్రిన్సిపల్ ను విధుల నుంచి తొలగించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3820030-666-3820030-1562934598950.jpg)
మరో వారం రోజుల్లో వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో... ఇప్పటివరకు పూర్తి కావాల్సిన పాఠ్యాంశాలు పూర్తి కాలేదన్నారు. ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపకులు ఆలస్యంగా రావటం వల్ల సిలబస్ పూర్తవ్వలేదని విద్యార్థులు చెప్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకపోతే తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపచేసి...నిరసనను విరమించేలా చేశారు.
ఇవీ చదవండి...తొలిపద్దులో మెరిసిన "నవరత్నాలు"
TAGGED:
sfi_demand_principal_suspend