Severe Drought in Joint Anantapur District: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర కరవు తాండవిస్తోంది.వర్షాభావ కారణంగా సుమారు1.30 లక్షల హెక్టార్లలో భూములు బీడుగా మారాయి. దీంతో 63 మండలాలకు చెందిన రైతులు దిక్కుతోచక రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. రైతులను, రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. నిధులు విడుదల చేసి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Severe Drought in Rayalaseema: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేక కరవు తాండవిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరు నిల్వ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో లక్షలకు లక్షలు అప్పులు చేసి పంటలు వేసిన అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది. రాయలసీమలో పరిస్థితి రోజు రోజుకు మరింతగా ఎక్కువవుతుంది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక పంటలన్నీ వెలవెలబోతున్నాయి. జలాశయాల కింద రెండు పంటలు సాగు చేసే మాగాణి భూములు కూడా నెర్రెలిచ్చాయి. దీంతో పంటలు నామరూపాల్లేకుండా ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం తాండవిస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 14 మండలాలను మాత్రమే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో రైతులు, రైతు సంఘాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం
Joint Anantapur Farmers Fire on YSRCP Govt:ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. తొలుత కురిసిన వానలకు అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా విత్తనాలు నాటారు. కానీ, తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. పంట కీలక దశలో ఉన్నపుడు చినుకు జాడ లేదు. దీనికి తోడు ఉన్న వర్షపు నీటిని జాగ్రత్తగా జలాశయాల్లో నిల్వ చేయాల్సిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం రైతులకు శాపంగా మారింది. నిధులు విడుదల కాక ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా కుంటుపడింది. దీంతో జలాశయాల్లోకి వచ్చిన కొద్దిపాటి నీరు కూడా దిగువకు వృథాగా పోతోంది. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద వేల ఎకరాల్లో భూములు ఎండిపోయాయి.