అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రాత్రి వీచిన ఈదురు గాలులకు అరటి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కళ్యాణదుర్గం, శెట్టూరు, కంబదూరు, కుందుర్పి మండలాల్లో బలంగా వీచిన గాలులకు పలువురు రైతులకు చెందిన మామిడి కాయలు అధికంగా రాలిపోయాయి. ముదిగల్లు గ్రామంలో రైతు మంజునాథకు చెందిన 200 అరటి చెట్లు నేలపాలయ్యాయి. శెట్టూరు మండలంలో గాలి తాకిడికి పలు చెట్లు విద్యుత్ తీగలపై విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా... యుద్ధప్రాతిపదికన ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
ఈదురుగాలుల బీభత్సం... అరటి, మామిడికి నష్టం - అనంతపురం జిల్లా తాజా సమాచారం
ఈదురుగాలులు మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న రైతులు ఆశలు నీరుగారాయి. కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.

Severe damage to orchards with dust storms