అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురంలో విషాదం జరిగింది. ఆరుబయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఇంటి గోడ కూలింది. ఏడేళ్ల సృజన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
పాత మట్టి మిద్దె గోడ వర్షాలకు నానడం వల్ల కూలిందని చిన్నారుల కుటుంబసభ్యులు వాపోయారు. అప్పటివరకు కళ్లెదుట ఆడుకుంటున్న ఆ బాలుడు... విగతజీవిగా మారడంతో సృజన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.