ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - Seizure of smuggled Karnataka liquor

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Seizure of smuggled Karnataka liquor
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

By

Published : Mar 5, 2021, 9:19 AM IST

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్​లోకి అక్రమంగా రవాణా చేస్తున్న 656 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్​ఈబీ సీఐ పవన్ కుమారు తెలిపారు.

వారిపై కేసు నమోదు చేసి రాయదుర్గం మున్సిఫ్ కోర్టులో హాజరుపరచగా.. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి:నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details