ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టిలో దాచిన మద్యం బిందె పట్టివేత.. ఒకరు అరెస్ట్ - Liquor bin hidden in mud in Vajrakur mandal

అక్రమంగా జరుగుతున్న మద్యం విక్రయాలను పోలీసులు అడ్డుకుంటున్నా.. సరికొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు దుండగులు. తాజాగా లంకె బిందెల తరహలో కర్ణాటక మద్యాన్ని బిందెలో ఉంచి.. భూమిలో పాతి పెట్టి విక్రయాలు సాగిస్తున్నాడు ఓ వ్యక్తి. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని బయటకు తీయించి.. వ్యక్తిని అరెస్ట్ చేశారు.

liquor seized
మట్టిలో దాచిన మద్యం

By

Published : Jun 15, 2021, 11:10 AM IST

పోలీసుల కళ్లుగప్పి.. అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఎప్పటికప్పుడు పోలీసులు వీటిని అడ్డుకున్నప్పటికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చాబాల గ్రామానికి చెందిన అంజి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం ప్యాకెట్లు తెపించాడు.

వాటిని ఓ బిందెలో ఉంచి.. తన ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బిందెను బయటకు తీయించగా.. అందులో 75 కర్ణాటక మద్యం ప్యాకెట్లు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. ఆ వ్యక్తి అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details