ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తనకల్లులో కర్ణాటక మద్యం స్వాధీనం - karnataka liquor seized in tanakallu

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మద్యం ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Oct 13, 2020, 12:19 PM IST

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలానికి చెందిన సభాపతి, యానాది, తనకల్లు మండలానికి చెందిన మనోహర్, చంద్రమోహన్​ల నుంచి కర్ణాటకకు చెందిన 700టెట్రా మద్యం పాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించిన కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన మద్యం దుకాణం యజమానిపై కేసు నమోదు చేసినట్లు తనకల్లు ఎస్ఐ రంగడు తెలిపారు.

మడకశిరలో...
అనంతపురం జిల్లా మడకశిర మండలం రేకులకుంట ఇసుక చెక్ పోస్ట్ వద్ద సిఐ రాజేంద్రప్రసాద్ ఆద్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఐచర్ వాహనాన్ని తనిఖీ చేపట్టగా వాహనంలోని నీటిశుద్ధి యంత్రాల పరికరాల మధ్యలో 40 బాటిళ్ల తెలంగాణ మద్యం పట్టుబడింది. పోలీసులు వాహనాన్ని మడకశిర పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

కడప జిల్లాలో..
కడప జిల్లా పులివెందులలోని అలవలపాడు క్రాస్ వద్ద డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఆటోను తనిఖీ చేపట్టగా..ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 130 కర్ణాటక మద్యం బాటిళ్లను గుర్తించారు. పోలీసులు ఆటోను సీజ్ చేసి నిందితున్ని అదుపులో తీసుకున్నారు.

ఇదీ చదవండి

కడప జిల్లా అదనపు ఎస్పీగా కాసిం సాహెబ్

ABOUT THE AUTHOR

...view details