అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ సిబ్బంది, పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం భారీ స్థాయిలో పట్టుబడింది. ఇరవై నాలుగు పెట్టెల్లో 2,304 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ రూ.1,20,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కారులో ఉన్న వ్యక్తి మద్యం బాక్సులను అక్కడే వదిలేసి పరారయ్యాడని... వాహనాన్ని సీజ్ చేశామని ఉరవకొండ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
విశాఖ జిల్లా :