అనంతపురం జిల్లా ధర్మవరంలో పేదలకు పంపిణీ చేయాల్సిన చౌక బియ్యం వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోంది. పట్టణ పోలీసులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ధర్మవరం నుంచి కర్ణాటకలోని పొగడకు వెళ్తున్న మూడు వాహనాలు పట్టుబడ్డాయి.
అదుపులో ఆరుగురు నిందితులు..
బియ్యం తరలిస్తున్న సదరు వాహనాలను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చౌక బియ్యం వ్యాపారాలకు డీలర్ల నుంచి వచ్చాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:
బంతి.. బంతికీ బెట్టింగ్