అనంతపురం జిల్లా మడకశిర మండలం రేకులకుంట పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. లారీలో 480 బస్తాల పీడీఎస్ చౌక బియ్యం పట్టుబడింది. వీటికి సంబంధించిన సరైన పత్రాలు లేని కారణంగా... చౌక బియ్యం కలిగిన లారీని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు ప్రశ్నించారు. కర్నూలు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట ఇదే చెక్ పోస్ట్ వద్ద కర్నూలు నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 18 టన్నుల చౌకబియ్యం పట్టుబడింది.